TOP 6 NEWS @ 6PM: మిలటరీ రహస్యాలు పాక్ కు చేరవేసిన వ్యక్తి అరెస్ట్

third time president, Donald Trumps key comments, Donald Trump, world news
x

 third time president, Donald Trump's key comments, Donald Trump, world news

Highlights

జన్మత: పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

1.జన్మత: పౌరసత్వం రద్దుపై సుప్రీంకోర్టుకు ట్రంప్

జన్మత: పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జన్మత: పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను మేరీల్యాండ్, మసాచుసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో దాఖలైన పిటిషన్లపై కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి.

2.మిలటరీ రహస్యాలు పాక్ చేరవేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్

భారత రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రవీంద్రకుమార్ పోలీసులు అరెస్ట్ చేశారు. హానిట్రాప్‌లో చిక్కిన ఆ వ్యక్తి భారత ఆర్మీకి చెందిన ఆయుధాలకు సంబంధించిన సమాచారంతోపాటు గగన్ యాన్ ప్రాజెక్టు వివరాలను అందించారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. రవీంద్రకుమార్ ఫిరోజాబాద్‌లో హజ్రత్ పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఫేస్ బుక్ లో నేహాశర్మ పేరుతో పరిచయమైన మహిళకు ఆయన మిలటరీ సమాచారం ఇచ్చారని పోలీసులు గుర్తించారు.

3.తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతల నమోదు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కుమురంభీమ్ జిల్లాల్లో42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

4.అమరావతి పనుల పున: ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. రాజధాని నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 64, 721 కోట్లు ఖర్చు చేయనున్నారు.

5.తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతించాలి: రఘునందన్ రావు

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఆయన అన్నారు.

6.కోడిపందెం, క్యాసినో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు

కోడిపందెం, క్యాసినో పోటీలను ఫామ్ హౌస్ లో నిర్వహించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నాలుగు గంటలపాటు మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో క్యాసినో, కోడిపందెం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ సోదాలపై పోలీసులు 61 మందిపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories