Unlock: మహారాష్ట్రలో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం

Unlock: ఐదు ఫేజ్‌లుగా అన్‌లాక్‌ ప్రక్రియ చేయనున్న సర్కార్‌ * ముంబైలో ఆర్టీసీ సేవలు పునఃరుద్ధరణ

Sandeep Eggoju
Updated on: 7 Jun 2021 1:13 PM IST
Unlock Process Started in Maharashtra
X

మహారాష్ట్రలో అన్ లాక్ ప్రక్రియ (ఫైల్ ఇమేజ్)

Unlock: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా కరోనా కేసులు తగ్గుతుండడంతో ఐదు ఫేజ్‌లుగా అన్‌లాక్‌ ప్రక్రియను అమలు చేయనుంది. ఐదు శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను మొదటి ఫేజ్‌గా గుర్తించింది. ఈ జిల్లాలను ఇవాళ్టి నుంచి పూర్తిగా అన్‌లాక్‌ చేసింది. ముంబైలో నేటి నుంచి ఆర్టీసీ బస్సుల సేవలను పునరుద్ధరించింది. బస్సుల్లో సీట్లకు సరిపడా ప్రయాణికులే ఉండాలని ఆదేశించింది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తరువాత కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసి మహారాష్ట్ర సర్కార్‌.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story