Suresh Gopi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి సురేష్ గోపి

Suresh Gopi: పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Sept 2024 5:31 PM IST
Union Minister Suresh Gopi visited Tirumala Temple
X

Suresh Gopi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి సురేష్ గోపి

Suresh Gopi: తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వామివారి దర్శనానికి కుటుంబంతో కలిసి వచ్చారు సురేశ్ గోపి. పుష్కరకాలం తర్వాత స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు.

దేశంలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు సురేష్ గోపి. కేరళలో పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. ఏపీలో వరదల నుంచి ప్రజలు బయటపడాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు సురేష్ గోపి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story