Minister Harsh Vardhan's mother Passes Away: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మాతృ వియోగం


minister Harsh Vardhan’s mother passes away
Minister Harsh Vardhan’s mother Passes Away: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి హర్షవర్ధన్ తల్లి స్నేహలత(89) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గుండె పోటుతో తన తల్లి మరణించారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Minister Harsh Vardhan's mother Passes Away: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి హర్షవర్ధన్ తల్లి స్నేహలత(89) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గుండె పోటుతో తన తల్లి మరణించారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా గుండె బద్ధలైంది. భూమిపై నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మా అమ్మ ఇక లేరు. స్వర్గానికి వెళ్లారు. ఆమె గుండె పోటుతో ఉదయం కన్నుమూశారు. నాకు మార్గదర్శి, స్ఫూర్తి. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ' మంత్రి హర్షహర్థన్ ట్వీట్ చేశారు.
అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తన తల్లి చివరి కోరిక మేరకు నేత్రాలను దానం చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. తల్లి మరణానికి సంబంధించి కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
Heartbroken to inform that my dearest person on earth, my Mother, has left for heavenly abode.
— Dr Harsh Vardhan (@drharshvardhan) September 6, 2020
She was 89 & suffered a cardiac arrest today morning.
A towering personality, my guide & philosopher, she has left a void in my life that none can fill.
May her pious soul find peace. pic.twitter.com/wCAm0P74OC

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire