డబ్ల్యూహెచ్‌ఓలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కీలక పదవి

డబ్ల్యూహెచ్‌ఓలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కీలక పదవి
x
Highlights

కేంద్రఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కు డబ్ల్యూహెచ్‌వోలో కీలకమైన పదవి దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఆరోగ్య శాఖ మంత్రి...

కేంద్రఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కు డబ్ల్యూహెచ్‌వోలో కీలకమైన పదవి దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నియమితులయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఈ నెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు హర్షవర్ధన్‌.

అయితే ప్రస్తుతం జపాన్‌ ఆరోగ్య మంత్రి హిరోకి నకటాని బోర్డు చైర్మన్‌గా ఉండగా.. హిరోకి పదవీకాలం ముగియడంతో హర్షవర్దన్‌ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. 34 మంది సభ్యుల కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత్‌కు అవకాశం ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయం తీసుకున్నారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ నియ‌మ‌కాన్ని డ‌బ్ల్యూహెచ్‌వోలోని 194 స‌భ్య‌దేశాలు అంగీక‌రించాయి. ఈనెల 22న జ‌ర‌గ‌నున్న బోర్డు మీటింగ్‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ను ఎంపిక చేస్తారు. హర్షవర్ధన్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. డబ్ల్యూహెచ్‌వో విధాన నిర్ణయాల్లో బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories