Gajendra Singh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్

Gajendra Singh Shekhawat Tests Positive for Covid19: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా.

S. Srikanth
Updated on: 20 Aug 2020 4:48 PM IST
Gajendra Singh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్
X
Representational Image

Gajendra Singh Shekhawat Tests Positive for Covid19: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది. అయితే దీనిని ఎదురించి, ధైర్యంగా కొంతమంది కోలుకుంటే, మరి కొంత మంది ఎదురొడ్డి పోరాటం చేయలేక అశువులు బాస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.. కొరోనా బారిన పడుతున్న సెలబ్రిటిల సంఖ్య కూడా బారిగా పెరుగుతుంది.. షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వెంటనేసీరియల్ నటులు ఒక్కొక్కరు కరొనా బారిన పడగా తాజాగా సినిమా వారి జాబితా కూడా పెరిగింది..సినిమారంగం,రాజకీయం, క్రీడారంగం ప్రతి రంగంలోని సెలబ్రిటిలు కరోనాని ఎదుర్కొంటున్నారు..

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'అనారోగ్యం పరంగా కొన్ని సంకేతాలను చూసిన తరువాత నాకు కరోనా పరీక్ష జరిగింది. నా నివేదిక తిరిగి సానుకూలంగా వచ్చింది. వైద్యుల సలహా మేరకు నేను ఆసుపత్రిలో చేరాను. చివరిగా నాతో కలిసిన వారు,తమకు తము స్వీయ నిర్భందంలోకి వెళ్ళాలను కోరుతున్నాను. అలాగే, తమను తాము పరీక్షించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి మరియు మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి'. అంటూ గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేసారు.


S. Srikanth

S. Srikanth

Next Story