Amit Shah Meeting: ముగిసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం

* నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రులతో చర్చ * నక్సల్స్ ప్రభావం తగ్గిందని వివరించిన హోంశాఖ అధికారులు

Arun Chilukuri
Updated on: 26 Sept 2021 8:09 PM IST
Union Home Minister Amit Shah Meeting With Chief Ministers Completed about Maoist Affected Places
X

ముగిసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం (ఫోటో: ది హన్స్ ఇండియా)

Amit Shah Meeting: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గత నాలుగేళ్లలో దేశంలో నక్సల్స్ ప్రభావం తగ్గిందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా హోంశాఖ అధికారులు వివరించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై సీఎంలు అమిత్‌షాతో చర్చించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రాలు చేస్తున్న అభివృద్ధిని హోంశాఖ మంత్రికి ముఖ్యమంత్రులు వివరించారు.

అలాగే మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్ల చర్చించారు. భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడం, మావోయిస్టు అనుబంధ సంస్థలపై చర్యలు చేపట్టడంపై సమావేశంలో ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. జనజీవన స్రవంతిలో కలిసే నక్సలైట్లకు ప్రోత్సాహం అందించాలని హోంశాఖ అమిత్‌షా సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story