వారికే జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసానికి అర్హత..నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం!

వారికే జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసానికి అర్హత..నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం!
x
house in gulmarg kashmir (file photo)
Highlights

జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే కావాల్సిన అర్హతలను వివరిస్తూ సరికొత్త నిబంధనలతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ...

జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే కావాల్సిన అర్హతలను వివరిస్తూ సరికొత్త నిబంధనలతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్గదర్శకాల కోసం జమ్మూ కాశ్మీర్ లోని 138 చట్టాలను సవరిస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం అక్కడి స్థానికులకు గ్రూప్ - 4 వరకూ ఉన్న ఉద్యోగాలలో భద్రత కల్పిస్తూ కాశ్మీర్ సివిల్ సర్వీస్ చట్టం లో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. దీనితో బయట వ్యక్తులు ఎవరికీ గ్రూప్ - 4 స్థాయి వరకూ అక్కడి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండదు. ఇదే కాకుండా పలు మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉన్నాయి.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ గతేడాది కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని 138 చట్టాలలో 28 చట్టాలను రద్దు చేసింది. ఈనేపధ్యంలో ఈ నోటిఫికేషన్ కేంద్రం విడుదల చేసింది. దేనిని జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తప్పుబట్టారు.

ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసానికి ఎవరు అర్హులంటే..

-నిబంధనల ప్రకారం ఎవరైనా 15 సంవత్సరాల పాటు స్థానికంగా నివసించినట్లయితే వారికి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అర్హత కల్పిస్తారు.

-10 సంవత్సరాల పాటు జమ్ము కశ్మీర్‌లో సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చట్టబద్ధమైన సంస్థలు, సెంట్రల్ యూనివర్శిటి, కేంద్ర ప్రభుత్వం గుర్తింపుపొందిన పరిశోధన సంస్థల ఉద్యోగుల పిల్లలు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అర్హులు అవుతారు.

- ఏడు సంవత్సరాల పాటు జమ్ముు కశ్మీర్‌లో చదువుకుని పది, పన్నెండు తరగతుల పరీక్షలకు హాజరైన వారు కేంద్ర పాలిత ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు.

- సహాయ పునరావాస కమిషనర్‌ చేత వలస వచ్చిన వారిగా గుర్తింపబడిన వ్యక్తులు స్థానికంగా నివాసం ఏర్పరచుకునేందుకు అర్హులు అవుతారు.

- అదేవిధంగా జమ్ము కశ్మీర్ స్థానికత కలిగి ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బయట ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పిల్లలు కూడా ఇందుకు అర్హులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories