వలస కార్మికులకు కేంద్రం శుభవార్త! వారి స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు కానీ..

కేంద్ర ప్రభుత్వం లక్దౌన్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ఇలా వివిధ కారణాలతో స్వస్థలాలకు దూరంగా చిక్కుపడి పోయిన వారు వారి వారి ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు కల్పించింది.

K V D Varma
Published on: 29 April 2020 7:40 PM IST
వలస కార్మికులకు కేంద్రం శుభవార్త! వారి స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు కానీ..
X

కేంద్ర ప్రభుత్వం లక్దౌన్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ఇలా వివిధ కారణాలతో స్వస్థలాలకు దూరంగా చిక్కుపడి పోయిన వారు వారి వారి ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, దీనికోసం కొన్ని షరతులు విధించింది.

లాక్ డౌన్ విధించిన ఐదు వారాల తర్వాత స్వస్థలాలకు చేరుకోలేక వేరే ప్రాంతాల్లో ఉండిపోయి ఇబ్బందులు పడుతున్న వారికి ఊరట కలిగించే అంశం ఇది. సుప్రీం కోర్టులో వలస కార్మికులకుక్ సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ ప్రారంభమైన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నేపధ్యంలో కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా వలస కార్మికులకు పెద్ద ఊరట ఇవ్వనుంది.

ఈ విధంగా చేయాల్సిందే!

- వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాల్సి ఉంటుంది. వీరు తమ స్వంత రాష్ట్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అంటే, రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమవారిని రాప్పించుకునేందుకు సమ్మతించాలి.

- కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

- ఆయా రాష్ట్రాలు వీరికి ప్రత్యేకంగా హెల్త్ చెకప్ లు నిర్వహిస్తాయి.

- వారి వారి ప్రాంతాలకు చేరుకున్న తరువాత అందరూ కచ్చితంగా 14 రోజుల పాటు స్వీయ నిర్భంధం (హోమ్ క్వారంటైన్) లో ఉండాల్సిందే.

- వీరికోసం ఆయా రాష్ట్రాల మధ్య బస్సులను నడపవచ్చు. అయితే, వాటిలో సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి. అలాగే బస్సు చేరుకున్న తరువాత దానిని పూర్తిగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story