జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమకు ఆదేశాలు

S. Srikanth
Published on: 2 April 2020 1:30 PM IST
జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమకు ఆదేశాలు
X

లాక్‌డౌన్‌ నేపథ్యంలో, 'పీఎం గరీబ్‌ కల్యాణ్‌' ప్యాకేజీ కింద జన్‌ధన్‌ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3-9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ఆ తేదీ తర్వాత లబ్ధిదారులు ఈ సొమ్మును తీసుకోవచ్చు. కాగా, కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.


S. Srikanth

S. Srikanth

Next Story