PM Modi: రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ

PM Modi: మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు * 2024లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా మార్పులు

Sandeep Eggoju
Updated on: 6 July 2021 10:31 AM IST
PM Modi: రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ
X

PM Modi: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. అయితే ఎవరు ఇన్‌.. ఎవరు ఔట్.. అనే దానికి ఉత్కంఠను రేపుతోంది. మంత్రివర్గ విస్తరణపై ప్రధాని మోదీ ఇప్పటికే కసరత్తులు చేసినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐతే ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు బీహార్‌, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రాల‌కు ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో గరిష్టంగా 81మంది మంత్రులను స్థానం ఉండగా, ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఇందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఓ మాజీ డిప్యూటీ సీఎంకు చోటు లభిస్తుందని సమాచారం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీర‌త్ సింగ్ రావ‌త్, అసోం మాజీ ముఖ్యమంత్రి శ‌ర్బానంద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణేలకు బెర్త్ లభించనుంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణ జోషితో పాటు మరికొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరీ ప్రధాని మోడీ తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారో చూడాలి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story