భారత్ లో చాపకింద నీరులా ఒమిక్రాన్ కేసులు.. తాజాగా ముంబైలో మరో రెండు కేసులు..

Omicron Cases: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకింది.

Arun Chilukuri
Updated on: 6 Dec 2021 9:30 PM IST
Two More Omicron Cases Detected in Maharashtra
X

భారత్ లో చాపకింద నీరులా ఒమిక్రాన్ కేసులు.. తాజాగా ముంబైలో మరో రెండు కేసులు..

Omicron Cases: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏండ్ల అతడి స్నేహితుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎలాంటి లక్షణాలు లేని వారిద్దరూ సెవెన్‌ హిల్స్ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పదికి చేరింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. నిన్న ఒక్కరోజే 17 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 9 కేసులు రాజస్థాన్‌లో నమోదవ్వగా 7 కేసులు మహారాష్ట్రలోని పూణే జిల్లాలో రికార్డు అయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story