Tungabhadra Dam: తుంగభద్రలో కొనసాగుతున్న అధికారుల సమీక్ష

Thungabhadra Dam: తుంగభద్రలో అధికారుల సమీక్ష కొనసాగుతోంది. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్త గేట్ అమర్చడంపై కసరత్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Aug 2024 11:53 AM IST
Tungabhadra Dam: తుంగభద్రలో కొనసాగుతున్న అధికారుల సమీక్ష
X

Thungabhadra Dam: తుంగభద్రలో అధికారుల సమీక్ష కొనసాగుతోంది. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్త గేట్ అమర్చడంపై కసరత్తు చేస్తున్నారు. గేట్ల నిర్మాణ నిపుణుడు కన్నయ్యకుమార్ డ్యామ్‌ను సందర్శించనున్నారు. ఇప్పటికే డ్యామ్‌ వద్దకు ప్రత్యేక నిపుణుల బృందాలు చేరుకుంది. డ్యాం నుంచి లక్షా 50వేల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కొప్పల్, బళ్లారి, కర్నూలు జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు. నదీ పరివాహక ప్రాంతంలోకి జనం వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. టీబీ డ్యాం పరిసర ప్రాంతాలలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story