కశ్మీర్‌ విభజన బిల్లుకు టీఆర్‌ఎస్ పూర్తి మద్దతు : నామ నాగేశ్వరరావు

K V D Varma
Published on: 6 Aug 2019 6:07 PM IST
కశ్మీర్‌ విభజన బిల్లుకు టీఆర్‌ఎస్ పూర్తి మద్దతు : నామ నాగేశ్వరరావు
X

జమ్ము కశ్మీర్‌ బిల్లులో కశ్మీర్‌ ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కశ్మీర్‌ విభజన బిల్లుకు టీఆర్‌ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందని నామా తెలిపారు. జమ్ము కశ్మీర్‌ విషయంలో ప్రధాని మోడీ, అమిత్‌ షాలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని నామా నాగేశ్వరరావు అన్నారు. కొన్ని సందర్భాల్లో చారిత్రక తప్పిదాలు జరుగుతుంటాయని...వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. పీఓకే ను ఇక నుంచి ఇండియన్ కశ్మీర్‌ అని పిలిస్తే బాగుంటుందని నామా సూచించారు.



K V D Varma

K V D Varma

Next Story