Tripura: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని.. అశ్లీల దృశ్యాలు చూస్తూ..

Tripura BJP MLA Jadav Lal Nath Watching Porn In Assembly
x

Tripura: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని.. అశ్లీల దృశ్యాలు చూస్తూ..

Highlights

Tripura: ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే పాడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

Tripura: ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే పాడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అశ్లీల దృశ్యాలు చూస్తూ అందరితో ఛీ అనిపించుకున్నారు. త్రిపుర అసెంబ్లీలో సభ జరుగుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యే జాదబ్ లాల్ నాథ్ తన పనిలో మునిగిపోయారు. రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా తన ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కారు. అయితే ఈ ఘటనపై బీజేపీ సీరియస్‌గా స్పందించింది. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించామని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ అశ్లీల వీడియోలు చూశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే మాత్రం స్పందించలేదు. సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ నుంచి మామూలుగానే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories