తల్లిదండ్రులుగా మారనున్న ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారిగా..

Trans Couple: కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జహాద్‌, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 4 Feb 2023 10:52 AM IST
Trans Couple In Kerala, Ziya And Zahad, Announce Pregnancy
X

తల్లిదండ్రులుగా మారనున్న ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారిగా..

Trans Couple: కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జహాద్‌, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట శుభవార్త చెప్పింది. మరి కొన్ని రోజుల్లో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెలలో జహద్ కు బిడ్డ పుట్టబోతున్నాడు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు. అయితే శిశువు కోసం జహాద్ తన గర్భాశయాన్ని తొలగించుకోలేదు. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించింది. 'తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్' అంటూ జియా పావల్‌ ఇన్‌స్టాలో రాసింది. బహుశా ఓ లింగ మార్పిడి జరిగిన పురుషుడు గర్భం దాల్చడం దేశంలో మొదటిదేమో అని క్యాప్షన్ లో పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story