Petrol Diesel Price Today: ఏపీలో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధరలు

Petrol Diesel Price Today: ఏపీలో అయితే ఏకంగా పెట్రోల్ ధరలు సెంచరీని దాటేశాయి.

Kranthi
Published on: 30 May 2021 6:51 AM IST
Today Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 30 05 2021
X

 Petrol Diesel Price Today:(File Image)  

Petrol Diesel Price Today: గ‌త కొద్ది రోజులుగా ఇంధన ధరలు దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో అయితే ఏకంగా పెట్రోల్ ధరలు సెంచరీని దాటేశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు (100.11), గుంటూరు (100.11), నెల్లూరు (100.26), విజ‌య‌వాడ (100.11)లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ దాటేసింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 93.94 గా ఉండ‌గా.. డీజిల్ రూ. 84.89 వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.19 గా న‌మోదుకాగా, డీజిల్ ధ‌ర రూ. 92.17 ఉంది.

చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 95.51 గా ఉండ‌గా, డీజిల్ రూ. 89.65 వ‌ద్ద కొన‌సాగుతోంది. బెంగ‌ళూరులో ఆదివారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 97.07గా న‌మోదుకాగా లీటర్ డీజిల్ ధ‌ర రూ. 89.99 వ‌ద్ద ఉంది

తెలుగు రాష్ట్రాల్లో …

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర క్ర‌మంగా వంద‌కు చేరువ‌వుతోంది. ఇక్క‌డ ఆదివారం లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 97.63 గా ఉండ‌గా.., డీజిల్ ధ‌ర రూ. 92.54 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఆదిలాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద‌ర‌కు చేరువైంది. ఇక్కడ‌ ఆదివారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రాష్ట్రంలో అత్య‌ధికంగా రూ. 99.51 గా న‌మోదైంది, ఇక డీజిల్ విష‌యానికొస్తే రూ. 94.29 వ‌ద్ద కొన‌సాగుతోంది.

విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్ర‌లో ధ‌ర రూ. 100.11 గా ఉండ‌గా.. డీజిల్ రూ. 94.43 వ‌ద్ద కొన‌సాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ లీట‌ర్ రూ. 99.24 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 93.57 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Kranthi

Kranthi

Next Story