India: ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం

India: కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది

Sandeep Eggoju
Updated on: 24 Feb 2021 12:31 PM IST
Today Central Election Commission Key Meeting
X

ఫైల్ ఇమేజ్ (ది హన్స్ ఇండియా)

India: కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. దీనిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది సీఈసీ. బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, కేరళలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలను మే చివరిలోగా పూర్తి చేయాలని భావిస్తోంది సీఈసీ. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో పర్యటించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్‌ సునీల్ అరోరా అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.

ఇవాళ జరిగే సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, కొవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. దీంతో అసోం పర్యటనలో ప్రధాని మోడీ చెప్పినట్లుగానే మార్చి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story