ప్రధాని మోడీపై ఈసీకి టీఎంసీ ఎంపీ ఫిర్యాదు

ఏపీ పర్యటనకు ప్రధాని ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌లను ఉపయోగించి..

Jyothi
Published on: 18 March 2024 11:16 AM IST
TMC MP Complaints to EC against Prime Minister Modi
X

ప్రధాని మోడీపై ఈసీకి టీఎంసీ ఎంపీ ఫిర్యాదు

Modi: భారత ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తోన్న ప్రధాని మోడీ ఏపీ టూర్‌ కోసం ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ కంప్లయింట్ చేశారు. కాగా తాను ఈసీకి రాసిన లేఖను మీడియాకు షేర్ చేశారు ఎంపీ సాకేత్ గోఖలే. 1975లోనూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఇదే కారణంతో ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించినట్లు టీఎంసీ ఎంపీ గుర్తు చేశారు.

Jyothi

Jyothi

Next Story