TikTok ban in India:: టిక్‌టాక్‌కు రూ.45వేల కోట్ల నష్టం..!

TikTok ban in India:: టిక్‌టాక్‌కు రూ.45వేల కోట్ల నష్టం..!
x
Highlights

Tiktok lose Rs.45,000 crores:తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ తో పాటుగా 59 చైనా యాప్ లపైన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Tiktok lose Rs.45,000 crores: తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ తో పాటుగా 59 చైనా యాప్ లపైన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చైనా విలవిల్లాడుతోంది. అయితే ఈ నిషేధం వల్ల టిక్‌టాక్‌, యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

టిక్ టాక్ అత్యధిక డౌన్ లోడ్లు ఉన్న దేశాలలో భారత్ గత కొద్ది రోజుల నుంచి మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. దీని తరవాత అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇక భారత్ లో మొత్తం 120 మిలియన్ల టిక్ టాక్ డౌన్ లోడ్లు ఉండగా, ఇప్పుడు అన్ని అన్ ఇన్స్టాల్ అయిపోయాయి. దీనితో టిక్ టాక్ సంస్థ భారీగానే నష్టపోయింది. భారత్‌ నిషేధించిన 59 యాప్‌లు మొత్తంగా రూ.70-80వేల కోట్ల వరకు నష్టపోయిందని సమాచారం..

భారత్ బ్యాన్ చేసిన చైనా యాప్ లలో ఇందులో టిక్ టాక్ యాప్ తో పాటుగా యూసీ బ్రౌజర్ యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్ , హలో, లైక్, యూకామ్, మేకప్ , వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్ , కామ్ స్కానర్ , మొబైల్ లెజెండ్స్ , న్యూ వీడియో స్టేటస్ , ఫోటో వండర్ , వీ మీట్ లతో పాటుగా మొదలగు యాప్స్ ఉన్నాయి.

గత కొన్ని రోజుల ముందు ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.. అయితే వారికి ప్రతికారంగా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. చైనా తయారు చేసిన ఉత్పత్తులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు. గతంలోనూ పలువురు ఎంపీలు కూడా ఈ యాప్ లను నిషేధించాలని పార్లమెంట్ లో తమ గళం విప్పారు. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories