Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!

Tiger Cubs: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 6 Dec 2025 12:12 PM IST
Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!
X

Tiger Cubs: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది. పవర్‌ ప్లాంట్‌ దగ్గర రెండు పులిపిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా.. అకస్మాత్తుగా రెండు పులిపిల్లలు తారసపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మార్నింగ్‌ వాకర్స్.. ఆ పులిపిల్లల ఆటలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. చంద్రపూర్‌ పట్టణానికి తడోబా అభయారణ్యం కూతవేటు దూరంలో ఉండటంతో తరచూ పులులు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story