Delhi Lockdown: ఢిల్లీలో మూడు రోజుల లాక్‌డౌన్!

Delhi Lockdown: 28,29,30 తేదీల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం * ఈనెల 28న హోలీ ఉండటంతో కఠిన ఆంక్షలకు సర్కార్ సిద్ధం

Sandeep Eggoju
Published on: 22 March 2021 12:22 PM IST
Three Days Lockdown in Delhi
X

ఢిల్లీ లాక్డౌ‌న్ (ఫైల్ ఫొటో)

Delhi Lockdown: హోలీ పండగ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలకు విధించాలని సర్కార్ సిద్ధమైంది. అయితే 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు.

ఇక ఢిల్లీలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే 4 వేల 288 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విపత్తు నిర్వహణ అథారిటీ కాసేపట్లో సమావేశం కానుంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై జరగనున్న చర్చించనుంది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story