Lockdown: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్

Lockdown: అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు.

Sandeep Eggoju
Published on: 16 April 2021 9:00 PM IST
This Sunday Complete Lockdown  In Uttar Pradesh
X

ఉత్తరప్రదేశ్ లొక్డౌన్ (ఫైల్ ఇమేజ్)

Lockdown: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్నారు. అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక మాస్క్ లేకుండా తిరిగేవారికి వెయ్యి రూపాయ‌ల జ‌రిమానా వ‌సూల్ చేయ‌నున్నారు. రెండ‌వ‌సారి మాస్క్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ వారికి ప‌ది వేల జ‌రిమానా విధించ‌నున్నారు. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఇవాళ ఉన్న‌త అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌ రెండు రోజుల క్రితం క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story