Madhya Pradesh: 30కి చేరనున్నకాంగ్రెస్ ఎమ్మెల్యేల.. రాజీనామా..

Madhya Pradesh: 30కి చేరనున్నకాంగ్రెస్ ఎమ్మెల్యేల.. రాజీనామా..
x
Kamal Nath (File Photo)
Highlights

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతిఘటన ఎదుర్కొంటుంది. నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతిఘటన ఎదుర్కొంటుంది. నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన 22మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ మధ్యప్రదేశ్ లో ఆ పార్టీకి కీలక నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయటంతో ఆయన మద్దతు దారులైన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. బెంగుళూరుకు సమీపంలోని దేవనహళ్లి వద్ద ఒక రిసార్ట్ లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారం మధ్యాహ్నం తమ పదవులకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఐదు రోజుల క్రితమే నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకోగా ఆ తర్వాత ఒక్కొక్కరుగా పెరుగుతూ వచ్చారు. జ్యోతిరాధిత్య సింథియా పార్టీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే హోటల్ ప్రాంగణంలో తమ రాజీనామా లేఖలతో 19మంది ఎమ్మెల్యేలు ఫోటో దిగారు. రాజీనామా లేఖలను స్పీకర్ కు పంపుతున్నట్టు కూడా ప్రకటించారు. వారి రాజీనామా లేఖలను భోపాల్ లో స్పీకర్ కు బీజేపీ నేతల బృందం సమర్పించడం విశేషం. బీజేపీ సీనియర్ నేత భూపేంద్ర సింగ్ ఆ రాజీనామా లేఖలను ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి భోపాల్ కు తీసుకెళ్లి స్పీకర్ కి ఇవ్వడం విశేషం. ఆ తర్వాత భోపాల్ లో మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు అందజేశారు. రాజీనామా చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య త్వరలో 30కి చేరుతుందని బీజేపీ నేతలు వెల్లడించారు.

కాగా ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు తమకు అందాయని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానని స్పీకర్ ప్రజాపతి తెలిపారు. ఎమ్మెల్యేలందరూ తమ రాజీనామా లేఖలను ఈ మెయిల్ ద్వారా మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కు పంపారు. అయితే ప్రస్తుతం లఖనౌలో ఉన్న లాల్జీ టాండన్ మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని.. ప్రస్తుతానికి తాను ప్రేక్షకుడిని మాత్రమేనని.. ఏ నిర్ణయమైనా భోపాల్ కు వెళ్లాకే తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రుల రాజీనామా విషయం తెలియగానే వారిని తొలగించాలని కోరుతూ గవర్నర్ కు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ లేఖ రాశారు. ఎమ్మెల్యేల రాజీనామాలను కనుక ఆమోదిస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206 అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 104కి తగ్గుతుంది. మొత్తానికి మంధ్యప్రదేశ్ లో ఈ రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories