రజనీకాంత్‌పై కొనసాగుతున్నAIADMK నేతల మాటల దాడి

admin1
Updated on: 25 Jan 2020 12:54 PM IST
రజనీకాంత్‌పై కొనసాగుతున్నAIADMK నేతల మాటల దాడి
X

ద్రవిడ ఉద్యమ నేత దివంగత పెరియార్‌పై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలతో తమిళనాట మాటల మంటలు కొనసాగుతున్నాయి. పెరియార్‌ను కించపరచడాన్ని సహించబోమని, AIADMK హెచ్చరించింది. తాజాగా మరో మంత్రి సెల్లూర్‌ కె రాజు రజనీ తీరుపై మండిపడ్డారు. ఎప్పడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. పెరియార్‌ సంస్కరణలు తీసుకురాకపోతే రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య పునర్వివాహం చేసుకొని ఉండేవారు కాదని సెల్లూర్‌ కె రాజు వ్యాఖ్యానించారు. పాత ఘటనను తెరపైకి తెచ్చి వివాదాల్లో చిక్కుకోవడం రజనీకి సరికాదని హితవు పలికారు.

admin1

admin1

Next Story