Parliament Building: చరిత్రగా మిగిలిపోనున్న పాత పార్లమెంట్ భవనం

Parliament Building: ఇక నుంచి నూతన బిల్డింగ్‌లో సమావేశాలు

Jyothi
Published on: 19 Sept 2023 11:44 AM IST
The Old Parliament Building will remain a Piece of History
X

Parliament Building: చరిత్రగా మిగిలిపోనున్న పాత పార్లమెంట్ భవనం

Parliament Building: స్వతంత్ర భారతదేశంలో ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంట్ బిల్డింగ్ ఇక నుంచి ఒక చరిత్రగా నిలవనుంది. ఇక నుంచి నూతన పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర‌్భంగా పాత బిల్డింగ్ గుర్తులను పదిలంగా ఉంచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

పాత పార్లమెంట్ ఎదుట ఉదయం ఫొటో సెషన్ నిర్వహించారు. మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్ ఫొటోకు పోజు ఇచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు వేర్వేరుగా ఫొటో దిగారు. వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తదితరులు ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.

రైసినా హిల్స్‌లో నూతనంగా నిర్మించిన భవనమే ఇకపై భారత పార్లమెంట్ అని కేంద్రం గెజిట్ విడుదల చేసింది. లోక్‌సభ స్పీకర్ ఆమోదంతో లోక్‌సభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.

Jyothi

Jyothi

Next Story