Delhi: రైతు సంఘాలను చర్చలకు పిలిచిన కేంద్రం

Delhi: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని కోరిన కేంద్రం

Shekhar G
Published on: 14 Feb 2024 12:13 PM IST
The Center Called Farmers Associations For Talks
X

Delhi: రైతు సంఘాలను చర్చలకు పిలిచిన కేంద్రం

Delhi: ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామంటూ రైతు సంఘాలకు సూచించింది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని రైతులను కోరింది కేంద్రం. అయితే నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనను కొనసాగిస్తున్నారు రైతులు. దేశ రాజధానిలోకి రావాలని చూసిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించి అడ్డుకున్నారు. రైతులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని కోరుతూ రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

Shekhar G

Shekhar G

Next Story