Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత

Jammu Kashmir: భారత ఆర్మీ ముందు లొంగిపోయిన టెర్రరిస్ట్

Sandeep Eggoju
Updated on: 28 Sept 2021 6:30 PM IST
Terrorist Surrendered Before the Indian Army in Jammu Kashmir
X

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత (ఫైల్ ఇమేజ్)

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే సంచలన విషయాలు తెలిపారు. పాక్ మిలటరీ కమాండర్ల సాయంతో టెర్రరిస్టులు భారత భేబాగంలోకి అక్రమంగా చొరబడుతున్నట్లు తెలిపారు.

గత నెల రోజుల్లో పాక్ వైపు నుంచి అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయని అయితే, ఉగ్రమూకలను విజయంవంగా అడ్డుకున్నామన్నారు. గడిచిన వారంలో ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాండే తెలిపారు. ఈ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అన్ని వైపులా భద్రతా దళాలు చుట్టుముట్టడంతో టెర్రరిస్టు అలీ బాబర్ పాత్ర లొంగిపోయినట్లు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story