Delhi: ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:28 PM IST
Delhi: ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
X

Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు.. వీహెచ్‌పీ కార్యకర్తలను నిలువరిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story