TOP 6 NEWS @ 6PM: కొత్త రేషన్ కార్డు జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Telangana new ration cards issue news, Rekha Gupta takes oath as Delhi CM, india to play Champions Trophy 2025 today
x

TOP 6 NEWS @ 6PM: కొత్త రేషన్ కార్డు జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Highlights

1) New Ration Cards: రేషన్ కార్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. కొత్త కార్డుల జారీలో.. New Ration Cards: రేషన్ కార్డుల జారీపై తెలంగాణ...

1) New Ration Cards: రేషన్ కార్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. కొత్త కార్డుల జారీలో..

New Ration Cards: రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం పోకస్ పెట్టింది. తొలి విడతలో లక్ష రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల పేరుతోనే రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా లబ్దిదారుల ఎంపికకు ఈ ఏడాది జనవరి 26న గ్రామ సభలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త రేషన్ కార్డుల జారీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉగాదికి కొత్త రేషన్ కార్డుదారులతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు చూపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌ను ప్రశ్నించిన మోదీ

హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. వేదికపై ఎన్ డీ ఏ పక్షాల నాయకులతో మోదీ పలకరించుకుంటూ వెళ్తున్నారు.

ఈ సమయంలో వేదికపై పవన్ కళ్యాణ్ ను ఆయన పలకరించారు. పవన్ కళ్యాణ్ దీక్షా వస్త్రాల్లో కన్పించారు. దక్షిణ భారతంలోని ఆలయాల సందర్శన సమయంలో ధరించిన వస్త్రాల్లోనే ఆయన ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను చూసిన మోదీ హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ప్రశ్నించారు. తాను చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని ఆయన మోదీకి సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు.

తనతో ప్రధాని ఎప్పుడూ మాట్లాడినా సరదాగా మాట్లాడుతుంటారని ఆయన చెప్పారు. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్లడం లేదని తాను మోదీకి చెప్పానని పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ ,జనసేన కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ఈ కూటమికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు.గురువారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చించారు.

3) దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేఖా గుప్తా

డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకేసక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్ డీ ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్వేశ్ సాహెబ్ సింగ్, ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా,పంకజ్ కుమార్ సింగ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. పర్వేశ్ సాహెబ్ సింగ్ సీఎం రేసులో ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Stock Market: దారుణం.. స్టాక్ మార్కెట్లో 50రోజుల్లో రూ.42 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Stock Market: 2025 సంవత్సరంలో మొదటి 50 రోజులు భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఈ 50రోజుల కాలంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలిందనే చెప్పుకోవాలి. ఈ ఏడాది మొదట్లో ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆశించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్ మదుపరులకు భారీ నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం షేర్ మార్కెట్ లో 3.5శాతం కంటే ఎక్కువ నష్టాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లో ఇన్వెస్టర్లు 41 లక్షల కోట్ల రూపాయిలను పోగొట్టుకున్నారు.

సెన్సెక్స్‌ 2024 డిసెంబరులో 78,139.01 పాయింట్ల వద్ద ముగిసినప్పటికీ, 2025లో మొదటి కొన్ని వారాల్లోనే అది 2,592.84 పాయింట్లు నష్టపోయింది. 20 ఫిబ్రవరి 2025 నాడు సెన్సెక్స్ 75,546.17 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే 31 డిసెంబర్ 2024లోని స్థాయితో పోలిస్తే ఇది 3.32శాతం నష్టాన్ని సూచిస్తుంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Donald Trump: భారత్‌లోకి టెస్లా.. మస్క్ చేసేది అన్యాయం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: అమెరికా కంపెనీ టెస్లా.. భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టెస్లా ఇక్కడ షోరూంల ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమని తెలిపారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ట్రంప్, మస్క్ ఇద్దరూ కలిసి ఫ్యాక్స్ న్యూస్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ పై మాట్లాడిన ట్రంప్.. ప్రపంచంలోని ప్రతి దేశం తమను వాడుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ తమ నుంచి లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. అందుకు భారత్ మంచి ఉదాహారణ అని చెప్పారు. దీంతో మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతోంది.

6) IND vs BAN: భారత్ విజయలక్ష్యం 229 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేష్ జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహీద్ హృదోయ్ సెంచరీతో ఆ జట్టు స్కోర్ పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత హసన్ అలీ 68, హసన్ 25 పరుగులతో బంగ్లాదేశ్ స్కోర్‌ను ఇంకెంత ముందుకు తీసుకెళ్లారు. 229 పరుగుల విజయలక్ష్యంతో భారత్ జట్టు బరిలోకి దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories