Stock Market: దారుణం.. స్టాక్ మార్కెట్లో 50రోజుల్లో రూ.42 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Stock Market: దారుణం.. స్టాక్ మార్కెట్లో 50రోజుల్లో రూ.42 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
x

Stock Market: దారుణం.. స్టాక్ మార్కెట్లో 50రోజుల్లో రూ.42 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Highlights

Stock Market: 2025 సంవత్సరంలో మొదటి 50 రోజులు భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి.

Stock Market: 2025 సంవత్సరంలో మొదటి 50 రోజులు భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఈ 50రోజుల కాలంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలిందనే చెప్పుకోవాలి. ఈ ఏడాది మొదట్లో ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆశించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్ మదుపరులకు భారీ నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం షేర్ మార్కెట్ లో 3.5శాతం కంటే ఎక్కువ నష్టాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లో ఇన్వెస్టర్లు 41 లక్షల కోట్ల రూపాయిలను పోగొట్టుకున్నారు.

సెన్సెక్స్‌ 2024 డిసెంబరులో 78,139.01 పాయింట్ల వద్ద ముగిసినప్పటికీ, 2025లో మొదటి కొన్ని వారాల్లోనే అది 2,592.84 పాయింట్లు నష్టపోయింది. 20 ఫిబ్రవరి 2025 నాడు సెన్సెక్స్ 75,546.17 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే 31 డిసెంబర్ 2024లోని స్థాయితో పోలిస్తే ఇది 3.32శాతం నష్టాన్ని సూచిస్తుంది.

నిఫ్టీ కూడా పతనం నిఫ్టీ కూడా 2025లో మదుపరులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 31 డిసెంబర్ 2024 నాటి నుంచి 23,644.80 పాయింట్ల నుండి 20 ఫిబ్రవరి 2025 నాటికి 22,813.95 పాయింట్ల వరకు నిఫ్టీ 3.51శాతం నష్టాన్ని నమోదు చేసింది.

బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్‌లో ఉన్న తగ్గింపుతో ఇన్వెస్టర్లు ఎంత నష్టపోయారో అర్థం అవుతుంది. 31 డిసెంబర్ 2024 నాడు స్టాక్ మార్కెట్ 4,41,95,106.44 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ నుండి 20 ఫిబ్రవరి 2025 నాటికి 4,00,65,487.87 కోట్ల రూపాయల వరకు ఇది తగ్గింది. అంటే ఈ 50 రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్లకు 41,29,618.57 కోట్ల రూపాయల నష్టం సంభవించింది.

500 కంపెనీలలో 447 కంపెనీల నష్టం 2025లో బీఎస్‌ఈ 500 కంపెనీలలో 447 కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది. వాటిలో కొన్ని పెద్ద కంపెనీలు ఉదాహరణకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జోమాటో, టీసీఎస్, ఎచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే ఐటీసీ సంస్థ 2025లో అత్యంత భారీగా మార్కెట్ క్యాప్ ను కోల్పోయింది. దాని విలువ 91,000 కోట్ల రూపాయల నుంచి క్రమంగా తగ్గింది. 2025లో అత్యధిక క్షీణత కన్పించిన సంస్థ ఇదే. ఈ నష్టాలు కేవలం మొదటి 50 రోజుల్లో మాత్రమే జరిగాయి.పరిస్థితి ఇంకా క్షీణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories