రేపు సౌదీ బస్సు ప్రమాద మృతులకు సామూహిక అంత్యక్రియలు

Arun Chilukuri
Published on: 19 Nov 2025 1:57 PM IST
రేపు సౌదీ బస్సు ప్రమాద మృతులకు సామూహిక అంత్యక్రియలు
X

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం ఘటనలో మృతి చెందిన 45 మంది హైదరాబాద్ యాత్రికులకు అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సౌదీ అరేబియాకు బయలుదేరింది. నాంపల్లి హజ్ హౌస్ నుంచి మృతుల కుటుంబ సభ్యులు 35 మందితో పాటు హజ్ కమిటీకి చెందిన ముగ్గురు సభ్యులు కలిపి మొత్తం 38 మందితో కూడిన బృందం విమానంలో బయలుదేరింది.

ఈ బృందం డీఎన్‌‌‌‌ఏ నమూనాల సేకరణ, మృతదేహాల గుర్తింపు, డెత్ సర్టిఫికెట్లు జారీ, సామూహిక అంత్యక్రియల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో డీఎన్‌‌‌‌ఏ పరీక్షల ద్వారానే డెడ్ బాడీల గుర్తింపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు కూడా ఆయా కుటుంబ సభ్యులకు సంబంధించిన పత్రాలు తప్పనిసరన్నారు. డీఎన్‌‌‌‌ఏ సరిపోలిక అనంతరం డెత్ సర్టిఫికెట్లు జారీ చేసి రేపు సామూహిక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే అన్ని మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు జరుపనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story