TDP: కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు

TDP: గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చాలని కోరిన ప్రకాశం జిల్లా నేతలు

Sandeep Eggoju
Published on: 31 Aug 2021 5:31 PM IST
TDP MLAs and Ex MLAs Meet the Central Irrigation Minister
X

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ (ఫైల్ ఇమేజ్)

TDP: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. పలు సమస్యలను మంత్రికి వివరించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదన్నారు. వెంటనే అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్‌లో చేర్చాలని కోరారు. ప్రకాశం జిల్లాలో కరువు, ప్రజల ఇబ్బందులు, తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అటు సమస్యలపై మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story