Tamil Nadu: మళ్లీ రాజకీయాల్లోకి శశికళ?

Tamil Nadu: పార్టీని సెట్ చేస్తానంటూ శశికళ హామీ ఇచ్చినట్లు ఆడియో వైరల్

Sandeep Eggoju
Updated on: 31 May 2021 11:43 AM IST
Tamil Nadu: Sasikala Re-Entry to Politics
X

శశికళ (ఫైల్ ఇమేజ్)

Tamil Nadu: జయలలిత నెచ్చెలి శశికళ మరో బాంబ్ పేల్చబోతున్నారా..? అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన చిన్నమ్మ.. రీ ఎంట్రీ ఇస్తున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది. అన్నా డీఎంకేలో ప్రస్తుతం పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు శశికళ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను వచ్చి పార్టీని సెట్ చేస్తానంటూ అన్నాడీఎంకే నేతకు హామీ ఇచ్చినట్లు ఓ ఆడియో వైరల్ కావడంతో చిన్నమ్మ పొలిటికల్ రీ ఎంట్రీ చర్చనీయంగా మారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story