Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో పవన్‌‌ కళ్యాణ్ పేరు ప్రస్తావించిన మంత్రి

* ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ప్రశంసిస్తూ జనసేనాని ట్వీట్ * తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిన పవన్ ట్వీట్

Sandeep Reddy
Published on: 3 Sept 2021 12:44 PM IST
Tamil Nadu Minister Mentioned Pawan Kalyan Name in Assembly About His Tweet on CM Stalin
X

సీఎం స్టాలిన్‌ను ప్రశంసిస్తూ జనసేనాని ట్వీట్ (ఫైల్ ఫోటో)

Tamil Nadu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు తమిళనాడు అసెంబ్లీలో వినిపించింది. అదేంటి..పవన్ కూ తమిళనాడు అసెంబ్లీకి ఏం సంబంధం అంటారా..? ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ను ప్రశంసిస్తూ జనసేనాని చేసిన ట్వీట్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలోకి వచ్చేవరకూ ఎవరైనా రాజకీయాలు చేయాలనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయకూడదని దీన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి స్టాలిన్ అంటూ ఆయన తన ట్వీట్ లో కొనియాడారు.

దీంతో తమ ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారు మెచ్చుకుంటున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ అసెంబ్లీలో జరిగిన కరోనా చర్చ సందర్భంగా లేవనెత్తారు. దీంతో ఈ చర్చ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story