ఇస్రో కేంద్రంపై తిరుగాడిన విమానాలు.. ఎవరివి?

ఇస్రో కేంద్రంపై తిరుగాడిన విమానాలు.. ఎవరివి?
x
Highlights

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్ర గిరిలోని ఇస్రో కేంద్రంపై శనివారం రెండు అనుమానిత విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం...

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్ర గిరిలోని ఇస్రో కేంద్రంపై శనివారం రెండు అనుమానిత విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అసలు ఆ విమానాలేవరివనే చర్చ సాగుతోంది. మరోవైపు పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇస్రోకు చెందిన ప్రొపుల్షన్‌ కాంప్లెక్స్‌ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉంది. ఉపగ్రహ ప్రయోగాలకు అవసరమైన జీఎస్‌ఎల్వీ రాకెట్ ఇంజిన్లు, విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఆర్‌పీఎఫ్‌) రక్షణ వలయంలోని ఈ కేంద్రంపై శనివారం తెల్లవారుజామున రెండు అనుమానిత విమానాలు తిరిగినట్లు విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులు వెంటనే దిల్లీలోని ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియపరిచారు. వారి సూచన మేరకు పణకుడి పోలీసులకు సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. 2015లో మానవ రహిత విమానం ఒకటి ఇదే రీతిగా వెళ్లింది. మళ్లీ 2017 ఆగస్టు 24, సెప్టెంబరు 25 తేదీల్లోనూ అనుమానిత విమానాలు ఇదే విధంగా తిరగడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories