భారత్-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి
Colonel Santosh babu (file photo)
భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారతీయ ఆర్మీ చైనా ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా కాల్పులకు తెగబడింది. చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు.
ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కల్నల్ సురేష్ లడఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ దళానికి కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.
Next Story




