మీరు గెలిస్తే మంచివా? ఈవీఎంలపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Supreme Court Rejected the Petition Against EVMs
X

మీరు గెలిస్తే మంచివా?: ఈవీఎంలపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో కూడా బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్న విషయాన్ని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విధానాన్ని అమలు చేయాలని పిటిషనర్ కోరారు.

ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ పై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేదు అంటారు... ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని అంటారు.. అంటూ జస్టిస్ విక్రమ్ నాథ్, పి.బి. వరోలే ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story