ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

* 56కు చేరిన మృతుల సంఖ్య * తపోవన్ టన్నెల్‌లో కార్మికుల ప్రాంతానికి చేరుకున్న రిస్క్యూటీమ్స్

Sandeep Eggoju
Published on: 16 Feb 2021 7:04 AM IST
Supportive measures are Going on in Uttarakhand
X
ఫైల్ ఇమేజ్ 

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో ఈ నెల 7న బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు బయటకు తీసిన మృతదేహాల సంఖ్య 56కి చేరింది.

మరోవైపు ఏడు రోజుల శ్రమ అనంతరం రెస్క్యూటీమ్స్ తపోవన్ టన్నెల్‌లో కార్మికులు ఉన్న చోటుకు చేరుకున్నారు. టన్నెల్‌లో మొత్తం 30 నుంచి 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో 12 మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా చాలా మందే ఉన్నట్టు తెలుస్తోంది. వారిని ఇవాళ సాయంత్రానికి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story