Chennai: కాలేజీ మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం..యూట్యూబ్ వీడియో చూసి మరీ

Chennai: కాలేజీ మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం..యూట్యూబ్ వీడియో చూసి మరీ
x
Highlights

Chennai: కాలేజీలో ఓ విద్యార్థిని బాత్రూమ్ లో ప్రసవించింది. అనంతరం శిశువును చెత్తకుండీలో పడేసిన అమానవీయ ఘటన చెన్నైలోని తంజావుర్ జిల్లాలో చోటుచేసుకుంది....

Chennai: కాలేజీలో ఓ విద్యార్థిని బాత్రూమ్ లో ప్రసవించింది. అనంతరం శిశువును చెత్తకుండీలో పడేసిన అమానవీయ ఘటన చెన్నైలోని తంజావుర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కాలేజీలో 4వేల మందికిపైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. 20ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. శుక్రవారం తరగతి గదిలో ఉండగా ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే బాత్రూమ్ కు వెళ్లి అక్కడ ఆడ శిశువును ప్రసవించింది.

అనంతరం యూట్యూబ్ వీడియో చూసి బొడ్డుకోసింది. తర్వాత బిడ్డను కాలేజీలోని చెత్త కుండీలో పడేసి చెత్తతో కప్పేసింది. తర్వాత ఏం జరగనట్లు వెళ్లి తరగతి గదిలో కూర్చొంది. రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు అధ్యాపకులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో వారు 108 అంబులెన్స్ ను పిలిచి కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తలించారు. అక్కడ వైద్యులు ఆమెను విచారించి మళ్లీ కళాశాలకు అంబులెన్స్ ను పంపించి శిశువును తీసుకువచ్చేలా చేశారు. బిడ్డకు చికిత్స అందించిన బతికించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై నాచ్చియార్ కోయిల్ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories