నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

admin1
Published on: 9 March 2020 10:42 PM IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X
stock market

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వెయ్యి 942 పాయింట్లు నష్టంతో.. 35వేల 635 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. 538 పాయింట్లు నష్టంతో నిప్టీ 10వేల 451 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పాటు.. చమురు ధరలు 28 శాతానికి పడిపోయాయి. యస్ బ్యాంక్, కరోనా ప్రభావం మరోసారి స్టాక్ మార్కెట్ పై పడింది.

దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం బ్లాక్ మండేగా మిగిలిపోయింది. సెన్సెక్స్ 1,941.67 పాయింట్లు నష్టపోయి 35, 634 వద్ద, నిఫ్టీ 538 పాయింట్లు పతనమై 10,451 వద్ద స్థిరపడ్డాయి. సోమవారం ఒకదశలో సెన్సెక్స్ 2,400పాయింట్లు పతనమైంది. దీంతో మదుపరుల గుండెలు బేజారెత్తిపోయాయి.

ప్రపంచ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం ఇప్పుడు మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సౌదీ, రష్యా మధ్య తలెత్తిన చమురు పోరు మరింత ఆజ్యం పోసింది. దేశ మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా అంతే ఘోరంగా పడిపోయాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇక ఎన్ఎస్ఈలో ఓఎన్‌జీసీ, వేదాంతా, రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

యస్ బ్యాంకులో అవకతవకల పుట్ట పగిలి లోపాలు బయటకు వచ్చి బ్యాంకింగ్ షేర్ల విలువను స్వాహా చేస్తున్నాయి. అన్ని కలిపి మార్కెట్ చరిత్రలో ఈ రోజు బ్లాక్ మండేగా మిగిలింది. మదుపరుల లక్షల కోట్ల సంపద కర్పూరంలా కరిగిపోతున్నాయి.

admin1

admin1

Next Story