Talmil Nadu: జయలలిత ఫ్లెక్సీలను చించిన కార్యకర్తలపై స్టాలిన్ ఆగ్రహం

Talmil Nadu: డీఎంకె కార్యకర్తలు అత్యుత్సాహంతో అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీని చించేశారు.

Kranthi
Published on: 4 May 2021 7:17 PM IST
Stalin Angered Over his own Party Cadre for Torn off Jayalalita Flexies
X

తమిళనాడు సీఎం స్టాలిన్

Talmil Nadu: గెలిచాం కదా అని రెచ్చిపోయారు. జయలలిత ఫ్లెక్సీలనే చించేశారు. తమ నాయకుడే ఆమె గురించి మంచిగా మాట్లాడారన్న విషయం మర్చిపోయారు. అందుకే ఇప్పుడు స్టాలిన్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తమిళనాడులో డీఎంకె ఘన విజయం సాధించాక.. ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కరోనా ఆంక్షలను పక్కన పెట్టి మరీ సంబరాల్లో మునిగి తేలారు. చెన్నైలో అయితే కొందరు డీఎంకె కార్యకర్తలు అత్యుత్సాహంతో అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీని చించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతోంది.

దీనిపై కంప్లయింట్ రావడంతో పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన వెంటనే స్టాలిన్ వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా ఒకప్పటి తమ రాజకీయ బద్ధశత్రువు అయిన జయలలితను ఓన్ చేసుకున్నాడు స్టాలిన్. ఆమె మరణం అనుమానాస్పదమని.. దానిపై విచారణ జరుపుతామని కూడా ప్రకటించాడు. అధినేత మనోగతం అర్ధం చేసుకోని ఆ కార్యకర్తలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు.

Kranthi

Kranthi

Next Story