SSC GD Notification 2021: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్

SSC GD Notification 2021: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ 2021 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మార్చి 25 న విడుదల

Kranthi
Updated on: 18 March 2021 4:41 PM IST
SSC GD Notification 2021 Will Be Released on 25th March
X

SSC Gd Constable 2021

SSC GD Notification 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) - 2021 పరీక్ష షెడ్యూల్‌ను మార్చి 25న విడుదల చేయనుంది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌సీ‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. కమిషన్‌ వెల్లడించిన ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం మే 10న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. అలాగే.. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు.

వీటి ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక...

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Online Written Examination), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination)ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఇక ఈ కంప్యూటర్‌ పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి.

పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

Kranthi

Kranthi

Next Story