Srinagar Encounter: జ‌మ్మూలో ఉగ్ర‌వాదుల ఏరివేత‌

Srinagar Encounter: కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, పోలీసులపై ఉగ్ర‌వాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగ‌బడ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

Karampoori Rajesh
Published on: 30 Aug 2020 6:59 PM IST
Srinagar Encounter: జ‌మ్మూలో ఉగ్ర‌వాదుల ఏరివేత‌
X

Srinagar encounter

Srinagar Encounter: కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, పోలీసులపై ఉగ్ర‌వాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగ‌బడ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఎదురుకాల్పులు దిగారు. ఈ ఎన్‌కౌంటర్ లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు అమరుడయ్యారని వెల్లడించారు.

శనివారం రాత్రి ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. రెండు జాయింట్ పార్టీలు... ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించి వారి కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా... ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపినట్లు ఆర్మీ తెలిపింది.

ఈ క్రమంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎన్‌కౌంటర్ జరిపారు. శనివారం ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఓ ఏఎస్ఐ బాబు రామ్ అమరుడయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులు శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని సమాచారం అందించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న పుల్వామాలో కూడా ముగ్గురు ఉగ్రవాదుల్ని లేపేసిన సైన్యం... మొన్న నలుగుర్ని హతమార్చింది. స‌రిహ‌ద్దుల్లో సొరంగాలు తవ్వుతూ... ఉగ్రవాదులు భార‌త్‌లోకి చొరబడుతున్నట్లు తెలుస్తోంది.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story