భద్రతా దళాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Arun Chilukuri
Published on: 29 Aug 2020 11:49 AM IST
భద్రతా దళాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

Encounter: జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా పుల్వామాలోని జధోరా ప్రాంతంలో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మ‌ట్టుబెట్టాయి. సోదాలు చేస్తోన్న‌ భద్రతా బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో దీటుగా ప్రతి స్పందించిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్ర‌రిస్టులు హతమయ్యారు. ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడి మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో గాలింపు ప్రక్రియ కొన‌సాగిస్తున్నాయి భార‌త బ‌ల‌గాలు. పుల్వామాలోని జధోరా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన ఎదురుకాల్పులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జధోరాలో ఉగ్రవాదులున్నట్టు నిఘా వర్గాల సమాచారం అందడంతో సైన్యం అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story