Sonu Sood: సోనూసూద్ సంచలన ప్రకటన.. ఎన్నికల బరిలో..

Sonu Sood: తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తారని రియల్ హీరో సోనూసూద్ సంచలన ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 14 Nov 2021 2:47 PM IST
Sonu Sood Sister Malvika To Contest Punjab Elections
X

Sonu Sood: సోనూసూద్ సంచలన ప్రకటన.. ఎన్నికల బరిలో..

Sonu Sood: తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తారని రియల్ హీరో సోనూసూద్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారన్నారు. ఇవాళ తన సోదరి మాళవికా సూద్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందన్న సోనూ ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్‌నూ త్వరలోనే కలుస్తానన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నది సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని, సమావేశాలతో అయ్యేది కాదని సోనూ వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story