నేడు జైపూర్‌లో నామినేషన్ వేయనున్న సోనియా

Sonia Gandhi: ప్రస్తుతం రాయ్‌బరేలి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం

Jyothi
Published on: 14 Feb 2024 9:49 AM IST
Sonia Gandhi will file Nomination Today in Jaipur
X

నేడు జైపూర్‌లో నామినేషన్ వేయనున్న సోనియా

Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఉదయం జైపూర్ బయల్దేరి వెళ్లారు. అయితే 1998 నుంచి 2022 మధ్య దాదాపు 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎంపికయ్యారు.

రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇరువురు సోనియాగాంధీతో జైపూర్ కు వెళ్లే అవకాశం ఉంది. సోనియా గాంధీకి కొన్ని ఇతర రాష్ట్రాల వారు నామినేషన్ దాఖలు చేయమని కోరినప్పటికీ.. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Jyothi

Jyothi

Next Story