Sonia Gandhi: కోవిడ్‌ కంట్రోల్‌ కోసం అఖిలపక్షం నిర్వహించండి.. ప్రధాని మోడీకి సోనియా సూచన

Sonia Gandhi: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.

Arun Chilukuri
Published on: 8 May 2021 10:53 AM IST
Sonia asks PM to call all-party meet on Covid
X

Sonia Gandhi: కోవిడ్‌ కంట్రోల్‌ కోసం అఖిలపక్షం నిర్వహించండి.. ప్రధాని మోడీకి సోనియా సూచన

Sonia Gandhi: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో సోనియా మాట్లాడుతూ..అన్నిపార్టీలు కలిసి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకుని అమలు చేస్తే ఆశాజనక ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులంతా హాజరయ్యారు.

ఆక్సీజన్, మందులు, వెంటిలేటర్లు, బెడ్ల కొరత తీర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని సోనియా కామెంట్‌ చేశారు. దేశంలో వ్యవస్థలన్నీ సరిగానే ఉన్నాయని వాటికి వనరులు అందించి పనితీరు మెరుగుపర్చడంలో ప్రధాని విఫలమయ్యారని విమర్శించారు సోనియాగాంధీ. సెకండ్‌ వేవ్‌కు సంబంధించి నేషనల్ టాస్క్‌ఫోర్స్ పార్లమెంటరీ ప్యానెల్‌ నుంచి వచ్చిన హెచ్చరికలను ప్రధాని పట్టించుకోలేదని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story