TOP 6 NEWS @ 6PM: SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. అంతకంతకూ పెరుగుతున్న ఉత్కంఠ

TOP 6 NEWS @ 6PM: SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. అంతకంతకూ పెరుగుతున్న ఉత్కంఠ
x
Highlights

1) SLBCలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆశలు వదులుకుంటున్న అధికారులు SLBC: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై...

1) SLBCలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆశలు వదులుకుంటున్న అధికారులు

SLBC: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావడంతో వారు బ్రతికే ఉన్నారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో భారీ ఎత్తున మట్టి కూలడం, నీరు బురద చేరడంతో ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువని భావిస్తున్నారు. వారంతా బురదలోనే టన్నెల్ బోరింగ్ మెషిన్ చుట్టూ కూరుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

SLBC సొరంగంలో చేపట్టిన పనుల్లో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదంగా మారింది. శనివారం ఉదయం 8.30 గంటలకు టన్నెల పైకప్పు కూలడంతో 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అయితే ఆరు రోజులవుతున్నా వారి ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. దీంతో కార్మికులు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. కార్మికులు ఒకవేళ ప్రమాదంలో గాయపడినా నీళ్లు, ఆహారం లేకుండా జీవించడం కష్టమని చర్చ జరుగుతోంది. మరోవైపు బురద, నీరు, మట్టి, రాళ్లతో టన్నెల్ ఎక్కడికక్కడ పూడుకుపోవడం, శిథిలాల తరలింపుకు సమయం పడుతుండడంతో కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Maha Kumbh: అసౌకర్యానికి గురైతే క్షమించండి.. కుంభమేళా ముగింపు సందేశంలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

Maha Kumbh: ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. మహాకుంభ మేళా ముగింపును పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఐక్యత మహాకుంభ్‌గా అభివర్ణించారు. భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే క్షమించాలని కోరారు. 45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళా విశేషాలను ప్రధాని మోడీ తన బ్లాక్‌లో చేశారు.

ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచింది. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తుల ప్రయాగ్ రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుందన్నారు మోడీ. నవభారత్‌ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) 1) రాజమౌళి, ఆయన భార్య రమ వల్ల చచ్చిపోతున్నాను - శ్రీనివాస్ రావు వీడియో

డైరెక్టర్ రాజమౌళికి స్నేహితుడిగా చెప్పుకుంటున్న శ్రీనివాస రావు అనే వ్యక్తి ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. రాజమౌళిపై ఆయన అనేక ఆరోపణలు చేస్తూ ఆ వీడియోను విడుదల చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తోన్న స్టంట్ కాదని, ఇది తన మరణ వాంగ్మూలం అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. ఇంతకీ ఆయన చేస్తోన్న ఆరోపణలు ఏంటంటే... రాజమౌళి తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక తను చనిపోవడానికి సిద్ధమయ్యానని తెలిపారు.

శ్రీనివాస్ రావు ఏం చెబుతున్నారంటే...

దేశంలోనే టాప్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, ఎంఎం కీరవాణి, మైత్రి మూవీ మేకర్స్ వంటి వారితో తను కలిసి పనిచేశాను. వాళ్లందరికీ రాజమౌళితో తన స్నేహం ఎలాంటిదో తెలుసు. 1990 నుండి మా మధ్య స్నేహం ఉంది. రామాయణం, మహా భారతంలో యుద్ధాలన్నీ ఆడవాళ్ల వల్లే జరిగాయని తెలుసు కానీ తమ మధ్య కూడా ఒక అమ్మాయి వల్లే గొడవ వస్తుందని అనుకోలేదు.

ఆర్య సినిమాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తరహాలో తమది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. ఏం చేద్దామని రాజమౌళిని అడిగితే నువ్వే నీ ప్రేమను త్యాగం చేయాల్సిందిగా చెప్పారు. అలా ఎలా కుదురుతుంది... ముగ్గురం కలిసే ఉందామని చెప్పా. అందుకు సమాజం ఒప్పుకోదని రాజమౌళి అన్నారు. నేను పెళ్లి చేసుకుంటా నలుగురం కలిసి ఉందామని రాజమౌళికి చెప్పాను. అది చాలా చెండాలంగా ఉంటుందని కుదరదు అన్నారు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి నన్నే త్యాగం చేయాల్సిందిగా చెప్పారు.

అప్పటికి రాజమౌళి ఇంకా శాంతి నివాసం సీరియల్ కూడా చేయలేదు. మాకు చేతిలో పని లేదు. అందుకే తనే రాజీపడ్డాను. కానీ ఇప్పుడు ఆ విషయం అందరికీ చెబుతానేమో అనే భయంతో ఆ ఇద్దరూ తనను తీవ్రంగా వేధిస్తున్నారు అని రాజమౌళిపై, ఆయన భార్య రమా రాజమౌళిపై శ్రీనివాస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదని, పబ్లిసిటీ కోసం వీడియోలు చేసే వారు చచ్చిపోవడానికి సిద్ధపడరని శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ ఆరోపణలపై రాజమౌళి కుటుంబం ఏమని స్పందిస్తుందనేదే ప్రస్తుతానికి చర్చనియాంశంగా మారింది.

4) Gene Hackman: జీన్ హ్యాక్‌మన్, భార్య బెట్సీ, పెంపుడు కుక్క అనుమానాస్పద మృతి

Gene Hackman's family found dead: ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మన్, ఆయన భార్య బెట్సీ అరకవ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. వారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. న్యూ మెక్సికోలోని హ్యాక్‌మన్ ఇంట్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి జరిగిన ఈ మూడు మరణాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే, ఘటన స్థలంలో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి వారి మృతికి గల కారణాలు కూడా పోలీసులు చెప్పలేకపోతున్నారు.

హాలీవుడ్‌లో అందరి చేత గౌరవ మర్యాదలు పొందిన అతికొద్ది మంది నటులలో జీన్ హ్యాక్‌మన్‌ ఒకరు. యాక్షన్, థ్రిల్లర్స్, కామెడీ... ఇలా అన్ని జానర్లలో ఆయన సినిమాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) MS Dhoni: సౌతిండియా హీరోలా అదిరిపోయిన ధోనీ ఎంట్రీ

Dhoni: ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని మైదానంలోకి ఎంటీ ఇస్తే చాలు స్టేడియం మొత్తం అభిమానుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోతుంది. కానీ ఈసారి టోర్నమెంట్లో ప్రారంభం కాకముందే అతడి ఎంట్రీ సంచలనం సృష్టించింది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్చి 23న తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందులో ధోని చాలా నెలల తర్వాత ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు అతను ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. దీని కోసం తను చెన్నై చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో అతను మోర్స్ కోడ్ ఉన్న టీ-షర్టు ధరించి సౌతిండియా హీలో లెవల్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధోనీ టీ-షర్ట్, తన ఎంట్రీ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Rs. 40 LPA Job offer: ఏడాదికి రూ. 40 లక్షల జీతం.. కాలేజ్ ముఖ్యం కాదు, రెజ్యూమ్‌తో పని లేదు

Bengaluru company offering Rs. 40 LPA Job without resume: ఉద్యోగం కోసం వేటలో ఉన్నారా? లేదంటే మరో జాబ్‌లోకి మారే పనిలో బిజీగా ఉన్నారా? అయితే, ఈ టెంప్టింగ్ జాబ్ ఆఫర్ మీకు సూట్ అవుతుందేమో చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జాబ్ ఆఫర్‌కు సంబంధించిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. జీతం ఏడాదికి రూ. 40 లక్షలు. అంటే నెలకు అంతా కలిపి రూ. 3,33,333 వస్తుందన్న మాట. వారానికి 5 రోజులే పని. రెండేళ్ల ఎక్స్‌పీరియెన్స్ ఉన్నా చాలు. లేదంటే అది కూడా అవసరం లేదు. అంతేకాదు... పనిచేస్తూనే ఆ కంపెనీలో షేర్స్ కూడా సొంతం చేసుకోవచ్చు.

అంత పెద్ద జీతం ఇస్తున్నారంటే కచ్చితంగా ఆ ఉద్యోగం చేసే వాళ్లు బాగా పేరున్న ఐఐటిలోనో లేక ఐఐఎం లాంటి కాలేజీల్లో చదివి ఉండాల్సిందే అని అనుకుంటున్నారేమో!! కానీ ఈ జాబ్ ఆఫర్ విషయంలో అలాంటిదేం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories