Rs. 40 LPA Job offer: ఏడాదికి రూ. 40 లక్షల జీతం.. కాలేజ్ ముఖ్యం కాదు, రెజ్యూమ్‌తో పని లేదు

Sudarshan Kamath offering Rs 40 LPA job offer for skilled cracked full-stack engineer at Smallest AI, college doesnt matter and resume not at all needed
x

Rs. 40 LPA Job offer: ఏడాదికి రూ. 40 లక్షల జీతం.. కాలేజ్ ముఖ్యం కాదు, రెజ్యూమ్‌తో పని లేదు

Highlights

Bengaluru company offering Rs. 40 LPA Job without resume: ఉద్యోగం కోసం వేటలో ఉన్నారా? లేదంటే మరో జాబ్‌లోకి మారే పనిలో బిజీగా ఉన్నారా? అయితే, ఈ...

Bengaluru company offering Rs. 40 LPA Job without resume: ఉద్యోగం కోసం వేటలో ఉన్నారా? లేదంటే మరో జాబ్‌లోకి మారే పనిలో బిజీగా ఉన్నారా? అయితే, ఈ టెంప్టింగ్ జాబ్ ఆఫర్ మీకు సూట్ అవుతుందేమో చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జాబ్ ఆఫర్‌కు సంబంధించిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. జీతం ఏడాదికి రూ. 40 లక్షలు. అంటే నెలకు అంతా కలిపి రూ. 3,33,333 వస్తుందన్న మాట. వారానికి 5 రోజులే పని. రెండేళ్ల ఎక్స్‌పీరియెన్స్ ఉన్నా చాలు. లేదంటే అది కూడా అవసరం లేదు. అంతేకాదు... పనిచేస్తూనే ఆ కంపెనీలో షేర్స్ కూడా సొంతం చేసుకోవచ్చు.

అంత పెద్ద జీతం ఇస్తున్నారంటే కచ్చితంగా ఆ ఉద్యోగం చేసే వాళ్లు బాగా పేరున్న ఐఐటిలోనో లేక ఐఐఎం లాంటి కాలేజీల్లో చదివి ఉండాల్సిందే అని అనుకుంటున్నారేమో!! కానీ ఈ జాబ్ ఆఫర్ విషయంలో అలాంటిదేం లేదు.

మీరు ఎక్కడ ఏ కాలేజ్‌లో చదువుకున్నారు అనేది మాకు ముఖ్యం కానే కాదు అంటోంది ఆ జాబ్ ఆఫర్ చేస్తోన్న కంపెనీ. అంతేకాదు... ఆ మాటకొస్తే అసలు మాకు మీ రెజ్యూమ్‌తో కూడా పనిలేదంటోంది. అరెరె... ఇదేదో సూపర్ టెంప్టింగ్ జాబ్ ఆఫర్ ఉంది కదా అని అనిపిస్తోంది కదా!! అంతేకదా మరి... పేరున్న కాలేజీల్లో చదువుకుంటేనే చదువు, స్కిల్స్ బాగా వస్తాయని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్న ఈ రోజుల్లో ఒక కంపెనీ అవేవీ చూడకుండానే జాబ్ ఇస్తామంటే ఎవరికైనా టెంప్టింగ్‌గానే అనిపిస్తుంది.

అసలు జాబ్ ఏంటంటే..

రైట్ ఇప్పుడు ఇక జాబ్ ఆఫర్ విషయానికొద్దాం. సుదర్శన్ కామత్ అనే యంగ్ ఎంటర్‌ప్రెన్యువర్ ఆర్టిఫిషియల్ రంగంలో స్మాలెస్ట్ ఏఐ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఆయనే సోషల్ మీడియా ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏడాదికి రూ. 40 లక్షలు జీతం కాగా అందులో రూ. 15-25 లక్షలు బేసిక్ శాలరీగా ఉంటుంది. మిగతా రూ.10-15 లక్షల వరకు స్మాలెస్ట్ ఏఐ కంపెనీలో షేర్స్ కేటాయిస్తారు. అంటే అక్కడ పనిచేస్తూనే అదే కంపెనీ యాజమాన్యంలో వాటాలు పొందవచ్చన్నమాట.

ఇక అనుభవం విషయానికొస్తే.. ఫ్రెషర్స్ నుండి రెండేళ్ల అనుభవం ఉన్న వాళ్ల వరకు ఎవ్వరైనా అర్హులే. తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో చదువుకున్నారనే విషయంతో పనిలేదు. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

ఇక చేసే పని విషయానికొస్తే... ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఫుల్ స్టాక్ ఇంజనీర్ అయి ఉండాలి. అన్నీ బాగే ఉన్నాయి కానీ మరి రెజ్యూమ్ కూడా పంపించకుండా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం ఎలా అనే కదా మీ డౌట్... రైట్ అక్కడికే వస్తున్నాం. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ ఒక 100 పదాలతో ఒక మెయిల్ పంపించాల్సిందిగా సుదర్శన్ కామత్ కంపెనీ మెయిల్ ఐడి ఇచ్చారు. అంతేకాదు... మీకు ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ పని వచ్చని నిరూపించుకోవడానికి మీరు ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్‌ను ఆ మెయిల్‌లో జత చేయాల్సిందిగా కోరారు. [email protected] అనే మెయిల్ ఐడికి ఆ డీటేల్స్ పంపించాల్సిందిగా చెప్పారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ చూసి సుదర్శన్ కామత్ ఇంప్రెస్ అయితే, ఆ జాబ్ ఆఫర్ ఇక మీదేనన్న మాట.


వైరల్ అవుతున్న జాబ్ ఆఫర్

సుదర్శన్ కామత్ ఎక్స్ ద్వారా చేసిన ఈ పోస్టుపై భారీ సంఖ్యలో నెటిజెన్స్ స్పందిస్తున్నారు. ఇప్పటికే మూడున్నర లక్షల మంది ఈ పోస్టును వీక్షించారు. వేల సంఖ్యలో లైక్ చేస్తున్నారు. అయితే, కొంతమంది ఈ పోస్టుపై సందేహాలు కూడా వ్యక్తంచేస్తున్నారు. అసలు ఏ అనుభవం లేకుండా క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ పని ఎలా సాధ్యం అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫిక్స్‌డ్ శాలరీ అయితే ఓకే కానీ ఈ షేర్స్ అలాట్ చేయడం లాంటివి ఈ రోజుల్లో అంత లాభదాయకం కాదని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆఫర్ మస్త్ టెంప్టింగ్‌గా ఉంది గురూ అనేది ఇంకొందరి అభిప్రాయం. మరి ఇంకెందుకు ఆలస్యం... గో అండ్ చెక్ యువర్ లక్.

Also watch this video: Maha kumbh Mela: ముగిసిన మహా వేడుక..పెట్టిన ఖర్చు ఎంత వచ్చిన ఆదాయం ఎంత? A trending Story on hm డిజిటల్

Show Full Article
Print Article
Next Story
More Stories